VENKAT | Date: Sunday, 16-05-2010, 3:46 PM | Message # 1 |
 Rockstar
Group: Global Moderator
Messages: 302
Status: Offline
| తన కుమారుడు రామ్ చరణ్ తేజ్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పెట్టుబడులు పెట్టే సీన్ (స్థాయి) లేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత హీరో తండ్రి చిరంజీవి స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలు ఓ అభూత కల్పనలుగా ఆయన కొట్టిపారేశారు. దీనిపై ఆయన తన పోలవరం యాత్రలో స్పందిస్తూ తన కుమారుడు ఐపీఎల్లో పెట్టుబడులు పెట్టినట్టు వస్తున్న వార్తలు తనకు మానసిక క్షోభకు గురి చేస్తున్నాయన్నారు. మీడియా ఒక వార్తలను ప్రసారం చేసేందు లేదా ప్రచురించే ముందు నిజా నిజాలను తెలుసుకుని రాయాలని చిరంజీవి హితవు పలికారు. వాడి (రామ్ చరణ్) సినిమా కెరీర్ మీకు తెలుసు. రెండు సినిమాలతోనే అంత సీన్ వచ్చేస్తుందా అని ప్రశ్నించారు. తమ టీఆర్పీ రేటింగ్‌ను పెంచుకోవడం కోసం అభూతకల్పనలతో కూడిన వార్తలను ప్రసారం చేయడం నేటి మీడియాకు ఫ్యాషన్‌గా మారిందన్నారు. అదే సయమంలో తనకు ఛానల్ పెట్టే యోచన.. ఉద్దేశ్యం లేదన్నారు.
|
|
| |